కోనసీమ: చించినాడ బ్రిడ్జి బేరింగ్ రీప్లేస్మెంట్ పనులు 14రోజులు జరగనున్న నేపథ్యంలో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నామని జాయింట్ కలెక్టర్ నిశాంతి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నెల 12,15,18,21, 24,27,30, ఏప్రిల్ 2,5,8,11,16,21,26 రాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు వాహనాలు రాకపోకలు నిలిపిస్తున్నామని JC పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.