TG: రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ రూపొందించే ప్రక్రియ ఇవాళ సంగారెడ్డి జిల్లా నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభం కానుంది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. హెల్త్ ప్రొఫైల్‌తో పాటు పౌరులందరికీ హెల్త్ కార్డులను జారీ చేస్తారు.