AP: ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ సహా అన్ని పథకాలకు ఫ్యామిలీ కార్డు తీసుకొస్తున్నట్లు ప్రణాళిక శాఖ సీఎస్ పీయూష్ కుమార్ వెల్లడించారు. దీనికి రేషన్ కార్డులతో సంబంధం ఉండదన్నారు. ఈ విధానంపై సర్వే చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కోటిన్నర BPL కుటుంబాలు ఉన్నాయని, ఆ జాబితా నుంచి రెండేళ్లలో 5 లక్షల కుటుంబాలు బయట పడతాయని పేర్కొన్నారు.