AKP: నర్సీపట్నంలో శ్రీ నూకాంబిక అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం వేడుకలు గురువారం ఉదయం ఘనంగా మొదలయ్యాయి. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు ఆధ్వర్యంలో కలశాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ, కేరళ డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలు, తదితర వాటితో అంబరాన్ని అంటే సంబరంగా ఆలయ ప్రారంభోత్సవం మొదలైందని ఆలయ అర్చకులు తెలిపారు.