CTR: నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో APSSDC ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన మేగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ పేర్కొన్నారు. 20కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. దాదాపు 1,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులు అర్హులన్నారు.