RR: మాడ్గుల(M) అవురుపల్లిలో నాగులగుట్ట పక్కన వెలిసిన పోచమ్మ జాతర ఉత్సవాలు ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ఛైర్మన్ విజయ్ భాస్కర్ తెలిపారు. జాతర ఉత్సవాలను పురష్కరించుకుని భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. గ్రామస్థులతో పాటు సమీప గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి జాతరను జయప్రదం చేయాలని ఆలయ ఛైర్మన్ కోరారు.