ATP: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన కరిడికొండ సచివాలయ సర్వేయర్ ఎస్.రవికుమార్‌ను సస్పెండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రవికుమార్ తీరుపై ప్రజలతో పాటు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నుంచి ఫిర్యాదులు అందాయి. విచారణలో బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు నిర్ధారణ కావడంతో జేసీ ఈ చర్యలు తీసుకున్నారు.