టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో షానీల్ డియో దర్శకత్వంలో ‘డెకాయిట్’ మూవీ రాబోతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తిచేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మూవీలో అడివి శేష్ నటనతో ఆకట్టుకుంటాడని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా 2026 ఏప్రిల్ 10న విడుదల కానుంది.