కోనసీమ: పేద ప్రజల సంక్షేమం కోసం వైసీపీ కృషి చేస్తుందని అమలాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ అన్నారు. ఆయన అమలాపురం మండలంలోని పేరూరు గ్రామంలో వైసీపీ నాయకులు గురువారం నిర్వహించిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొని దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు పంచారు.