NRPT: జిల్లాలోని సావర్కర్ చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో అమెరికా, ఇజ్రాయెల్ వైఖరిని నిరసిస్తూ గురువారం ధర్నా నిర్వహించారు. ఇరాన్‌పై చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలపై అడ్డగోలుగా దాడులు చేస్తూ ప్రజల ప్రాణాలను, ఆర్థిక వ్యవస్థలను అమెరికా ధ్వంసం చేస్తోందని విమర్శించారు.