KKD: మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపదన యోజన పథకం ద్వారా సముద్రంలో చేపల వేట చేయు మత్స్యకారులకు సబ్సిడీపై మంజూరి అయిన బోటు ఇంజన్లు, గూడ్స్ ఆటోను మత్స్యకారులకు అందజేశారు. మత్స్యకారులను అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.