KRNL: టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డిని పెద్దకడబూరు ఎస్సై మారుతి బుధవారం వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. స్థానిక పరిస్థితులు, ప్రజా సమస్యలు, పలు అంశాలపై చర్చించారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని రాఘవేంద్ర రెడ్డి సూచించారు.