MDCL: స్నాచింగ్ కేసును వారం రోజుల్లోనే ఛేదించి మేడిపల్లి పోలీసులు అభినందనలు అందుకున్నారు. ఈనెల 3న నారపల్లిలో రేణుక(60) మెడలోని 3 తులాల పుస్తెలతాడును దోచుకుని దొంగ పరారయ్యాడు. SHO గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక బృందాలు 300 CC కెమెరాలను పరిశీలించి నేరస్థుడిని పట్టుకున్నారు.నిందితుడు భర్మావత్ నాగరాజు (38), DJ ఆపరేటర్‌గా గుర్తించారు.