MBNR: జడ్చర్ల మండలం నక్కలబండ తండా వద్ద ఎక్సైజ్ పోలీసులు జరిపిన తనిఖీల్లో అక్రమంగా ఆల్ఫాజోలం తరలిస్తున్న ముగ్గురిని నిన్న అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కోయిలకొండ మండలం పెద్దపల్లి తండాకు చెందిన కొండానాయక్ బైక్పై వెళ్తుండగా పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 240 గ్రాముల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకుని, దీనిని సరఫరా చేసిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.