KRNL: జిల్లాలోని PHCలు, CHCల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలు (NQAS) సాధించాలని శనివారం కలెక్టర్ డా. సిరి ఆదేశించారు. కలెక్టరేట్ సమీక్ష హాల్లో ఆమె మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, పరికరాలు సమకూర్చి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ప్రమాణాలు పాటించే ఆసుపత్రులకు కేంద్ర నిధులు అందుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.