CTR: చిత్తూరు డివిజన్లోని విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ మునిచంద్ర తెలిపారు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. చిత్తూరు రూరల్, గుడిపాల,యాదమరి, ఐరాల, తవణంపల్లి, బంగారుపాలెం, పూతలపట్టు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని చెప్పారు.