ADB: బోథ్ మండల కేంద్రానికి చెందిన మెరుగు సాయితేజకు మంజూరు అయిన రూ. 31,500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును శనివారం నెరడిగొండ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఈ సాయం అందించిందని, బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.