KMM: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో 14-15 ఏళ్ల వయసున్న 19,500 మంది బాలికలను గుర్తించి, వారికి వచ్చే నెల నుంచి ఉచితంగా HPV వ్యాక్సిన్ వేయనున్నారు. ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ పూర్తయింది. యుక్త వయసులోనే ఈ టీకా వేయడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును నివారించవచ్చని అధికారులు తెలిపారు.