MDK: వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ సూచించారు. శనివారం నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందేందుకు రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.