BDK: పేకాట,కోడిపందాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ శనివారం తన కార్యాలయం నుండి ఒక ప్రకటనను విడుదల చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నిరంతర వాహన తనిఖీలు, గస్తీ ముమ్మరం చేసినట్లు తెలిపారు.