KMM: సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం సూచించారు. ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలను వెంట తీసుకెళ్లాలని లేదా బ్యాంకులో భద్రపరుచుకోవాలని తెలిపారు. దొంగతనాల నియంత్రణకు రాత్రి గస్తీ పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రజలు వారి వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.