కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ‘మినీ గోకులం’ పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తోందని మచిలీపట్నం ఎంపీ బాలసౌరి అన్నారు. కోడూరు ఏడో వార్డులో యార్లగడ్డ వెంకటనారాయణ ఇంటి వద్ద రూ.2 లక్షల ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన మినీ గోకులం షెడ్‌ను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.