కోనసీమ: రాయవరంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సందర్భంగా సీఎం చంద్రబాబు సంక్రాంతి వేడుకలపై కీలక సూచనలు చేశారు. గోదావరి జిల్లాల్లో కోడిపందాలు సంప్రదాయమే అయినప్పటికీ, జూదాలకు తావు లేకుండా పండుగ జరుపుకోవాలని కోరారు. మన వారసత్వాన్ని పరిరక్షించుకోవాలే తప్ప, జూదాల ద్వారా దానిని బలహీనపరచుకోవద్దని, ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలని కోరారు.