SKLM: ఇచ్చాపురం మండలం ఎం.తోటూరు జంక్షన్, రైల్వే క్రాసింగ్ గేటు సమీపంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను రూరల్ ఎస్సై జనార్ధనరావు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 11.370 కిలోల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చిన్నం నాయుడు ఇవాళ మీడియాకు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు.