KNR: కేజీబీవీ విద్యార్థినులను విద్యావంతులుగా మార్చి, అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను కోరారు. ‘నీపా’ (NIEPA) సౌజన్యంతో కేజీబీవీ ప్రత్యేక అధికారులు, వార్డెన్లకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణలో ఆమె మాట్లాడారు. బాలికలు స్వశక్తితో ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు.