సిద్దిపేటలో దారి తప్పిన నాలుగేళ్ల బాలుడిని వన్ టౌన్ పోలీసులు సురక్షితంగా తల్లికి అప్పగించారు. పోలీసుల వివరాలు.. కుమురం భీం జిల్లాకు చెందిన మౌనిక తన కుమారుడితో కలిసి సిద్దిపేట రాగా, ఆడుకుంటూ బాబు బయటకు వచ్చి తప్పిపోయాడు. వెంటనే స్పందించిన పోలీసులు బాలుడిని గుర్తించి తల్లికి అప్పగించారు. సకాలంలో స్పందించి క్షేమంగా తల్లి చెంతకు చేర్చిన పోలీసులను స్థానికులు అభినందించారు.