CTR: బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎలాంటి నేరాలకు పాల్పడకుండా శాంతియుతంగా జీవించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, వృద్ధులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లా బహిష్కరణ విధిస్తామని హెచ్చరించారు.