NLG: బీఆర్ఎస్ పాలనలోనే 25 కోట్లతో చిట్యాల పట్టణంలో పలు అభివృద్ధి పనులు జరిగాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెల్లడించారు. గతంలో మంజూరు చేసిన పనులకే తిరిగి ఎమ్మెల్యే, ఎంపీ శంకుస్థాపనలు చేశారని పేర్కొన్నారు. చిట్యాలలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండేళ్లుగా నయా పైసా మంజూరు చేయని వారు ఎన్నికలు వస్తుండడంతో హడావిడి చేస్తున్నారన్నారు.