MBNR: జిల్లాలోని ఎంబీసీ క్రీడా మైదానంలో ఈ నెల 12న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు.