SDPT: అతి చిన్న వయసులోనే అద్భుతమైన కథలు రాస్తూ రాణిస్తున్న విద్యార్థి విశ్వతేజకు ‘బాల రత్న’ పురస్కారం దక్కింది. అనంతసాగర్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విశ్వతేజకు, హైదరాబాదు చెందిన కమలాకర ట్రస్ట్ ఈ అవార్డును ప్రకటించింది. శుక్రవారం కలెక్టర్ హైమావతి విద్యార్థికి అవార్డు అందజేసి అభినందించారు. అనంతరం విద్యార్థి సృజనాత్మకతను ఆమె కొనియాడారు.