గుంటూరు న్యూ రైల్వే స్టేషన్ వద్ద మత్తు పదార్థాలు విక్రయిస్తున్న మున్నా, ప్రేమ కుమార్లను కొత్తపేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి లిక్విడ్ గంజాయి 3.12 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.