TG: ప్రమాదబీమాపై బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 1.02 కోట్ల ప్రమాద బీమాను కల్పించేందుకు బ్యాంకులు ఒప్పుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. కాగా, ఇప్పటికే సింగరేణి, విద్యుత్ సంస్థల ఉద్యోగులకు బీమా అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.