ADB: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్న నాగోబా జాతరను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం కేస్లాపూర్ దర్బార్ హాల్లో నిర్వహించిన సమావేశంలో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.