AP: రాష్ట్రంలో టీచర్ నియామకాలకు సంబంధించి టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికే విడుదలైన డీఎస్సీ షెడ్యూల్ యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా.. టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
బంగారం ధరలు ఇవాళ స్పల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.380 తగ్గి రూ.97,530కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.89,400 వద్ద కొనసాగుతుంది. అటు కిలో వెండిపై రూ.1000 తగ్గి రూ.1,11,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
అల్లూరి: రంపచోడవరం,చింతూరు ఐటీడీఏల పరిధిలోని 8(బాలురు-4,బాలికలు-4)గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 1,030సీట్లకు(బాలురు-540, బాలికలు-490)అడ్మిషన్ కౌన్సెలింగ్ శనివారం నిర్వహించనున్నట్లు ఇరు ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బాలికలకు రంపచోడవరం గురుకుల బాలికల కళాశాల, బాలురకు రంపచోడవరం గురుకుల బాలుర కళాశాలలో ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
KMM: జిల్లాలో 8 మైనార్టీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి పురందర్ అన్నారు. 2025-26 విద్యా సం. రానికి గాను అడ్మిషన్ల పక్రియ ఈనెల 31తో ముగుస్తుందని చెప్పారు. 5 నుంచి 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆయా విద్యా సంస్థలలో సంప్రదించాలని పేర్కొన్నారు.
JEE అడ్వాన్స్డ్ పరీక్ష రాసిన విద్యార్థుల రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. ఈ నెల 18న పరీక్ష నిర్వహించగా.. తాజాగా రెస్పాన్స్ షీట్లను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. JEE అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రెస్పాన్స్ షీట్లు పొందవచ్చు. కాగా, జూన్ 2న తుది కీ, ఫలితాలు విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. షీట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NTR: ఈ నెల 25న దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. బుధవారం విజయవాడలోని కలెక్టరేట్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు.
SRPT: చివ్వెంలలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఖాళీగా ఉన్న పోస్టులకు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ జీవి. విద్యాసాగర్ బుధవారం తెలిపారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, ఇంగ్లీష్, సోషల్ ఆంగ్లంలో బోధించడానికి ప్రావీణ్యం కలిగిన అభ్యర్థులు ఈనెల 23వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాలని ప్రిన్సిపల్ తెలిపారు.
GNTR: ఏపి రాజధాని అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యా యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ సంస్థను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఏపీ విద్యార్థులకు 20 % సీట్లు రానున్నాయి.
ప్రకాశం: ఒంగోలు సూర్య హైస్కూల్లో జరుగుతున్న ఓపెన్ టెన్త్ ఇంగ్లీష్ పరీక్షలో కాపీయింగ్ కలకలం రేగింది. DEO కిరణ్ కుమార్ ఆకస్మిక తనిఖీలో ఓ విద్యార్థి నకిలీ పత్రాలతో పట్టుబడ్డాడు. దీంతో సదరు విద్యార్థిని డిబార్ చేయగా, విధులు నిర్వర్తించడంలో విఫలమైన ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తప్పించారు.
KRNL: జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 27వరకు నిర్వహించనున్నారు. 69 కేంద్రాల్లో 17,129 మంది విద్యార్థులు హాజరుకానున్నారని విద్యాశాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ 10,865, ప్రైవేట్ 5,532, ఓపెన్ స్కూల్ 736 మంది పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి.
NTR: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ విధానంలో 9 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 2, కంప్యూటర్ ఆపరేటర్ – 4, డేటాఎంట్రీ ఆపరేటర్-9 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నామని, అభ్యర్థులు ఈనెల 31లోపు https:// drntr.uhsap.in/index/లో దరఖాస్తు చేయాలని వర్సిటీ అధికారులు సూచించారు.
భారత్ నుంచి ఆకాశ్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్న తొలి దేశం ఏదీ?1. శ్రీలంక2. ఇజ్రాయెల్3. అర్మేనియా4. రష్యాGK: నిన్నటి ప్రశ్నకు జవాబు- రష్యాNOTE: పోటీ పరీక్షల ప్రత్యేకం
శ్రీకాకుళం జిల్లాలోని మోడల్స్ స్కూల్లలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మేరకు ఈ నెల 22వ తేదీ వరకు apms.ap.gov.in వెబ్సైట్ ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ రిజర్వేషన్ల ప్రతిపాదికన మే 26న సీట్లు కేటాయించనున్నారు. 27వ తేదీన వెరిఫికేషన్ నిర్వహించే జూన్‌లో తరగతులు ప్రారంభిస్తారు.
SKLM: రాష్ట్రంలో ఉన్న 4 RGUKT ట్రిపుల్ ఐటీ (IIIT)లోని ప్రవేశాలకు గత నెల 24వ తేదీని నోటిఫికేషన్ విడుదలైంది. 2025 – 26 ఏడాదికి పదో తరగతి పాసైన విద్యార్థులకు 6 ఏళ్ల బిటెక్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు www.rgukt.in వెబ్ సైట్, ఆన్లైన్లో ఈ నెల 20వతేదీ లోపు ఆప్లై చేసుకోవచ్చు. వివరాలకు అధికారిక వెబ్ సైట్‌ను చూడండి.
శ్రీకాకుళం జిల్లాకు డీఎస్సీలో 458 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైంది. ఈ క్రమంలో జిల్లాలో 22,648 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుంచి 39,235 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తంగా ఒక్కో పోస్టుకు 85 మంది పోటీపడుతున్నారు. కొంచెం కష్టపడితే జాబ్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంటున్నారు.