NLG: శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వీ. దర్శిష్ భార్గవ్ “తెలంగాణ ఆంగ్లం ఒలంపియాడ్” పోటీలో రాష్ట్రస్థాయిలో ఎంపికైనట్లు గైడ్, జిల్లా ఇంగ్లీష్ డీఆర్పీ చిత్తలూరి సత్యనారాయణ తెలిపారు. ఎంపికైన దర్శిష్ భార్గవ్ ను పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, ఉపాధ్యాయులు శ్రీరాములు, రవికుమార్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.