NZB: జిల్లా రెంజల్ మండలంలో ఆన్లైన్ బెట్టింగులతో నష్టపోయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కూనేపల్లి గ్రామానికి చెందిన పెరుమండ్ల సంజయ్(28) అప్పుల బాధ భరించలేక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు రెంజల్ ఎస్సై కే. చంద్రమోహన్ సోమవారం తెలిపారు. రెండున్నర లక్షల వరకు అప్పుచేసి, ఆ నగదుతో ఆన్లైన్ బెట్టింగులు పెట్టి, నష్టపోయాడని తెలిపారు.