చాట్‌జీపీటీ, జియోహాట్‌స్టార్ జతకలిశాయి. ఇకపై చాట్ జీపీటీలో వినోదాత్మక కంటెంట్ గురించి సెర్చ్ చేసే వారికి జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ లింక్‌లు కనిపించనున్నాయి. మరోవైపు జియోహాట్ స్టార్, ఓపెన్ ఏఐ కలిసి చాట్‌జీపీటీ పవర్డ్ వాయిస్ డిస్కవరీ ఫీచర్‌ను కూడా తీసుకువచ్చాయి. ఇది వ్యూయర్స్ అడిగిన దాన్ని బట్టి వినోదాత్మక కంటెంట్‌ను సజెస్ట్ చేయనుంది.