పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా శ్రీలంక-ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన వైట్ బాల్ సిరీస్ అనూహ్యంగా రద్దయింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 13 నుంచి 25 వరకు దుబాయ్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య పోరు సాగాల్సి ఉంది. అయితే, ఆ ప్రాంతంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో, ఆటగాళ్ల భద్రత దృష్ట్యా సిరీస్ను రద్దు చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.