TG: స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టమైన ‘మిలియన్ మార్చ్’కు నేటితో 15 ఏళ్లు. ఈ చారిత్రక సందర్భాన్ని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గుర్తుచేసుకున్నారు. ‘స్వరాష్ట్ర సాధనకు ట్యాంక్‌బండ్‌పై యావత్ తెలంగాణ ప్రజలు ఏకమై గర్జించి నేటికి 15 ఏళ్లు. నిర్బంధాలు, దిగ్బంధాలు, అడ్డంకులు, బ్యారికేడ్లు, ఇనుపకంచెలు ఏవీ ఉద్యమకారుల స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయాయి’ అని రాసుకొచ్చారు.