KDP: మండలంలోని అన్ని రైతు సేవ కేంద్రాలలో పంట నమోదు జాబితా ప్రదర్శించడం జరిగిందని ఏవో శ్యాంబాబు తెలిపారు. మండలంలో 6671 మంది రైతులు 26201 ఎకరాలలో పంట సాగు చేశారని వివరించారు. రైతులు జాబితాలో పంట పేరు విస్తీర్ణం సరి చూసుకోవాలని అన్నారు. ఏవైనా తేడాలుంటే రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించి పరిష్కారం చేసుకోవాలని సూచించారు.