VZM: గజపతినగరం మేజర్ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీతాలను తక్షణమే చెల్లించాలని CITU జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 4 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులు జీతాలు మంజూరు చేయకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎంపీడీవోకు కార్మికులతో కలిసి జీతాలను విడుదల చేయాలని వినతిపత్రం అందజేశారు.