సత్యసాయి: పుట్టపర్తి రూరల్ మండలం నిడిమామిడి గ్రామంలో మంగళవారం జరిగిన నిడిమామిడమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.