TG: హైదరాబాద్ గల్లీల్లో బెల్టు షాపుల దందా అసలు ఆగడం లేదు. ప్రభుత్వ వేళలు ముగిసినా అర్ధరాత్రి వరకు మద్యం దర్జాగా అమ్ముతున్నారు. MRP ధర కంటే ఎక్కువ వసూలు చేస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. పర్యవేక్షణ కరువవడంతో ఈ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందని పలువురు మండిపడుతున్నారు. బెల్టు షాపుల వల్ల ప్రభుత్వం ఆదాయానికి కూడా గండి పడుతుందని ఫైర్ అవుతున్నారు.