E.G: రాజమండ్రిలోని బృహన్నలపేటలో గల ఆయుష్మాన్ భారత్ హెల్త్ & వెల్నెస్ సెంటర్ వద్ద గురువారం నిర్వహించిన HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. భవిష్యత్తులో మహిళలను సర్వికల్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, బాలికలు పాల్గొన్నారు.