MDCL: బాచుపల్లి మండల పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీ వాసుల పోరాటం ఫలించింది. సర్వే నంబర్ 186లో హిందూ స్మశాన వాటిక కోసం 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఓ బాలిక మృతి చెందగా, దహన సంస్కారాలకు స్థలం లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు మండల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.