ATP: శింగనమల మండలం కల్లుమడి గ్రామంలో మంగళవారం జరిగిన శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవాల్లో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.