VKB: వేసవి కాలం మొదవగానే నగరంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా జిల్లాలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉష్ణోగ్రతల నుంచి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పిల్లలు, యువకులు స్విమ్మింగ్ పూల్స్‌కు పరుగులు తీస్తున్నారు.