JGL: వేంపేట గ్రామానికి చెందిన లింగారెడ్డి జిల్లా రైతు సలహా కమిటీ సభ్యుడిగా నియమితులవ్వడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, సర్పంచ్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. నియామకానికి సహకరించిన కోరుట్ల నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన లింగారెడ్డి, రైతుల సంక్షేమం కోసం పని చేస్తానన్నారు.