అనంతపురం మార్కెట్ యార్డులో శని, ఆదివారాల్లో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బల్లా పల్లవి మంగళవారం చర్యలు చేపట్టారు. భక్తులు, రైతులు, వ్యాపారుల రద్దీ దృష్ట్యా జేసీబీ సహాయంతో కొత్త మార్గాన్ని శుభ్రం చేయించి సిద్ధం చేశారు. ఈ పనులను ఆమె స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు.