CTR: మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో 258 మంది లబ్ధిదారులకు ఈ-సైకిళ్లు, 508 స్వయం సహాయక సంఘాలకు రూ.69.10 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను పంపిణీ చేశారు. అలాగే 75 మందికి స్వయం ఉపాధి రుణాలు, ఇద్దరికి ఎగ్ కార్ట్స్ అందజేశారు.